రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి జిల్లా,మునుగోడు ప్రతినిధి,జులై07,(గరుడ న్యూస్):
తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే చేయలేని విధంగా ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థిని విద్యార్థులకు చేయూత 2024–2025 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి పరీక్షల్లో మొదటి స్థానం,ద్వితీయ స్థానం,తృతీయ స్థానం,సాధించిన విద్యార్థిని విద్యార్థులకు సన్మానం నగదు బహుమతి ప్రతిభ పురస్కాతలను ప్రధానం చేశారు.ఈ నేపథ్యంలో సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని సర్వేలు గ్రామం ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ ఫలితాలు సాధించినటువంటి ఇరుగుదిడ్ల సౌమ్య,మొదటి బహుమతిగా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతుల మీదుగా 15000/—రూపాయలు,ద్వితీయ బహుమతి, గంగాదేవి పవన్ కుమార్ 10000/—రూపాయలు,ఎల్లంకి అనుదీప్ కి 7500/—అందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపితం చేయడానికి మునుగోడు నియోజకవర్గం లోని విద్యార్థిని విద్యార్థులకు కోమటిరెడ్డి సుశీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తామని,విద్యార్థుల భవిష్యత్తుకు ఫౌండేషన్ ఎల్లవేళలా తోడుగా ఉంటుందని ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి లక్ష్మి,తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సర్వేల్ కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ ఉపాధ్యక్షులు సుక్క స్వామి,ఎంఈఓ గోలి శ్రీనివాసులు, విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు, ప్రజలు,తదితరులు,పాల్గొన్నారు.



