గరుడ ప్రతినిధి
చౌడేపల్లి జులై 07
మండల కేంద్రమైన చౌడేపల్లి శ్రీ అభీష్టత మృత్యుంజయ స్వామి ఆలయంలో సోమవారం విశేష పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు ఉదయాన్నే పరమ శివునికి విశేషాభిషేకం అలంకరణ నిర్వహించారు రాష్ట్ర నలుమూలల నుంచి కాకుండా తమిళనాడు కర్ణాటక నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి అభిషేక పూజలో పాల్గొన్నారు వారందరికీ పవిత్ర తీర్థప్రసాదాలు అందించారు



