గరుడ న్యూస్, విజయనగరం
జూలై 8 న మంగళవారం దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తుంది. విజయనగరం జిల్లా స్ధాయిలో అన్ని మండల కేంద్రాల్లో ఎంపీపీలు, జడ్పీటీసీలు గ్రామాలు పరిధిలో ముఖ్య నాయకులు, అన్ని అనుబంధ విభాగాలు, కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కలిసి జయంతి కార్యక్రమాలు పలు సేవా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించాలని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) తెలియజేయడం జరిగింది.
7293990953372970301.jpg)



