

తిరుపతి జిల్లా, రేణిగుంట మండలం గరుడ న్యూస్ ప్రతినిధి పాకాల మురళి: రేణిగుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని కరకంబాడి వద్ద ముగ్గురు అనాధ పిల్లలు తిరుగుతుండగా అనుమానం వచ్చిన పోలీసులు విచారించగా మాతృశ్రీ చైల్డ్ హోమ్ లో విద్యార్థులమని ఇంగ్లీష్ మీడియం చదువులు కష్టంగా ఉన్నాయని నచ్చక పరారైనట్టు చెప్పుకొచ్చారు. చిన్నారులు లంకేష్ (9),సహదేవ(11), ముఖేష్(12) గుర్తించారు. పిల్లలకు కౌన్సిలింగ్ ఇచ్చి తిరిగి వారిని సురక్షితంగా హోమ్ నిర్వహణలకు అప్పగించారు రేణిగుంట పోలీసులు.
