

పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు అధ్యక్షతన “చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ” నియోజకవర్గం స్థాయి కార్యక్రమం విజయవంతం
- సూపర్ సిక్స్ హామీలు ప్రజలకు అందించేలా చూసే బాధ్యతను ప్రధాన ప్రతిపక్షంగా వైసిపి తీసుకుని ప్రజల పక్షాన పోరాడుతుంది – జిల్లా పార్టీ అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్తు రాజు
- బాబు షూరిటీ మోసం గ్యారంటీ – చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ కార్యక్రమం మండల స్థాయి మరియు గ్రామ, వార్డు స్థాయిలో విజయవంతం చేయాలి – మాజీ ఎమ్మెల్యే జోగారావు
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్వతీపురం నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం పార్టీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు అధ్యక్షతన నిర్వహించగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా జిల్లా పార్టీ అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్తు రాజు, రాష్ట్ర వైసిపి కార్యదర్శి మాజీ తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్ పాల్గొనగా బాబు షూరిటీ మోసం గ్యారంటీ – చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ నియోజకవర్గ స్థాయి కార్యక్రమాన్ని వందలాదిమంది పార్టీ శ్రేణులు సమక్షంలో క్యూ అర్ కోడ్ ను ప్రదర్శించి ఘనంగా ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగినది.
ఈ విస్తృత స్థాయి సమావేశంలో క్యూఆర్ కోడ్ ద్వారా డాక్యుమెంట్ రిలీజ్ చేయడం జరిగినది, ఈ డాక్యుమెంట్లో చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన బాండ్లు గురించి, గత జగనన్న ప్రభుత్వం నాటి పథకాలు ఎలా ఎగర గొడుతున్నారు, అలాగే చంద్రబాబు మోసాల వల్ల ప్రజలకు కలిగిన నష్టం ఎంత అన్నది నియోజకవర్గ ప్రజలు అందరికీ వివరించాలని మాజీ ఎమ్మెల్యే జోగారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మామిడి శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ ఆదేశాల మేరకు చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు చేస్తూ అనే కార్యక్రమం ద్వారా గత ఏడాది కాలంగా రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు చేస్తున్న మోసాలను తెలియజేయడమే కాకుండా ఇస్తామన్నా సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చకుండా ఎలా ప్రజలను మోసం చేస్తున్నారు అన్న విషయాన్ని ఈ కార్యక్రమం ద్వారా ఐదు వారాలపాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు.

ఈ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిలుగా నియోజకవర్గ పరిధిలో గల మండల పార్టీ అధ్యక్షులు కొండపల్లి బాలకృష్ణ, బోమ్మి రమేష్, పాలవలస మురళీకృష్ణ, బొంగు చిట్టి రాజు, ప్రజా ప్రతినిదులు మున్సిపల్ చైర్ పర్సన్ బోను గౌరీస్వరి, వైస్ చైర్మన్లు కొండపల్లి రుక్మిణి, యిండుపూరు గున్నేవరరావు, జడ్పిటిసిలు అలజంగి రవి కుమార్, ఎంపీపీలు మజ్జి శోభారాణి, గుడివాడ నాగమణి, బలగ రమణమ్మ, వైస్ ఎంపీపీలు వెలీది సాయిరాం, సిద్దా జగన్నాధం, బంకూరీ రవి కుమార్, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు బలగ శ్రీరాములు నాయుడు, ప్రధాన కార్యదర్శిలు పోల సత్యనారాయణ, తప్పిట ప్రసాద్, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, కౌన్సిలర్ సభ్యులు, పార్టీ ప్రతినిదులు, పార్టీ వివిధ అనుబంధ విభాగాల హోదాలలో గల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, కార్యదర్శులు, సీనియర్ నాయకులు, వార్డుల ఇంచర్జీలు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
