
గరుడ ప్రతినిధి
చౌడేపల్లి జూలై 09
మండల కేంద్రమైన చౌడేపల్లి శిరిడి సాయిబాబా ఆలయంలో ఈనెల 10న గురు పౌర్ణమి వేడుకలను నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు రంగనాథ బాబు తెలిపారు బాబా ఆలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించబడునని ఆయన వివరించారు ఉచిత అన్నదాన ప్రసాదం నిర్వహిస్తారని ఈ సందర్భంగా ఆయన వివరించారు కాకడ హారతి పూజలలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు
