గరుడ ప్రతినిధి
చౌడేపల్లి జూలై 09
తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశాన్ని విజయవంతం చేయాలని మండల విద్యాశాఖ అధికారి కేశవరెడ్డి కోరారు బుధవారం స్థానిక ఎం ఆర్ సి భవనంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఈ నెల 10న ఉపాధ్యాయులు తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందన్నారు విద్యార్థుల తల్లిదండ్రులు ఈ సమావేశంలో పాల్గొనాలన్నారు ప్రతి పాఠశాలలో మెగా పేరెంట్ మీటింగ్ 2.0 జరుగుతుందన్నారు మన పాఠశాల ఆవరణలో ఆనందంగా గడుపుతూ విద్యా వికాసం వివిధ అంశాలతో వారి అభివృద్ధిని ఉపాధ్యాయులతో చర్చించడానికి ఇది మంచి అవకాశం అని ప్రతి తల్లిదండ్రులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు



