

చిత్తూరు జిల్లా, కుప్పం నియోజకవర్గం కొత్తపేట మండలం గరుడ న్యూస్ ప్రతినిధి ఆర్ మంజునాథ్: కుప్పం ముద్దుబిడ్డ, రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో పలమనేరు జాతీయ రహదారి నుంచి కుప్పం నియోజకవర్గంలోని రాళ్ళబుదుగురు గ్రామం మీదుగా కర్ణాటక సరిహద్దు వరకు సుమారు 9.5 కిలోమీటర్లు, రూ. 4.5 కోట్ల వ్యయంతో తారు రోడ్డుకు పూజా కార్యక్రమాన్ని నిర్వహించి ప్రారంభించడం జరిగింది.





