చౌడేపల్లి మండలం కాటిపేరి గ్రామం నందు తల్లితండ్రుల సమావేశం పుంగనూరు నియోజకవర్గం ఇన్చార్జి శ్రీ చల్లా రామచంద్రారెడ్డి గారి ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు శ్రీ గువ్వల రమేష్ రెడ్డి గారి సూచనలు సలహాలతో కాటిపేరి ఉన్నత పాఠశాల నందు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు తల్లి తండ్రులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించబడింది ముఖ్య అతిధి టీడీపీ పంచాయతీ అధ్యక్షుడు సి సుబ్రహ్మణ్యం రెడ్డి ని మరియు టీడీపీ కార్యకర్తలు సీడీ . పురుషోత్తం సి శివా రెడ్డి. మరియు రాజా రెడ్డి పాల్గొనడం జరిగింది. కార్యక్రమం లో పిల్లల తల్లితండ్రులతో సి సుబ్రహ్మణ్యం రెడ్డి గారు మాట్లాడి వారికీ పుస్తకాలు, నోట్ పుస్తకాలు మరియు యూనిఫామ్ మొదలగు వస్తువులు అందజేశారు. మధ్యాహ్న భోజనం పరీక్షించడం జరిగింది . తారువాత పిల్లలతో ఇష్టాగోష్ఠి జరిపి పిల్లలకు ఏమైనా ఇబ్బందులు వస్తే తన దృష్టికి తీసుకు రావాలని తెలియ జేశారు.



