గరుడ ప్రతినిధి
చౌడేపల్లి జూలై 10
చౌడేపల్లి మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు మెగా పేరెంట్స్ టీచర్స్ ప్రోగ్రాం కళాశాల ప్రిన్సిపాల్ జయప్రకాష్ గారు ప్రారంభించడం జరిగింది విద్యార్థులను ఉద్దేశించి విద్యార్థుల చదువు కు నిలిచిపోకుండా బాగా చదువుకొని మంచి ఫలితాలు సాధించడానికి ప్రభుత్వం ఎన్నో ఉచిత పథకాలు విద్యార్థులకు అందిస్తున్నాయి తల్లికి వందనం పథకం కింద 15000 తల్లుల ఖాతాలకు డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్టు విద్యా శక్తి ద్వారా మద్రాసు వారిచే క్లాసులు అందిస్తున్నాయి ఇవన్నీ విద్యార్థులు చక్కగా ఉపయోగించుకొని మంచి ఫలితాలు సాధించాలని తెలియజేశారు అనంతరం తల్లులకి విద్యార్థుల ప్రోగ్రెస్కారులు చూపించి పిల్లలచే తల్లిలకు వందనం కార్యక్రమం నిర్వహించారు పేరెంట్స్ ముఖ్య అతిథులుగా చౌడేపల్లి MPDO లీలా మాధవి మండల స్పెషల్ ఆఫీసర్ విజయకుమార్ ఆర్డబ్ల్యూఎస్ ఏఈ సురేష్ రెడ్డి SI నాగేశ్వరరావు హాజరైనారు MPDO మాట్లాడుతూ నేటి విద్యార్థులే బావి భారత పౌరులనీ తెలిపారు మండల స్పెషల్ ఆఫీసర్ మాట్లాడుతూ ప్రభుత్వం అందించే ఉచిత పథకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు AE మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని తెలిపారు SI మాట్లాడుతూ విద్యార్థులు అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమం అనంతరం కళాశాలలో కార్యక్రమానికి హాజరైన అందరికీ మధ్యాహ్నం భోజనాలు పెట్టి కార్యక్రమం ముగించడం జరిగింది





