గరుడ ప్రతినిధి చౌడేపల్లి జూలై 10
పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల పరిధిలోని పుదిపట్ల గ్రామ పంచాయతీ లో మెగా పేటీఎం 2.0 సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు నిర్వహించబడిన ఈ కార్యక్రమం కోసం ఏర్పాటు చేయబడిన ఈ వేదిక పైన సభాధ్యక్షురాలు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గారు అయినటువంటి శ్రీమతి శ్రీ పద్మజా గారు అలాగే ఎస్ఎంసి కమిటీ చైర్మన్ ఆర్ మనోహర్ రెడ్డి గారు పాఠశాల ఎక్స్ చైర్ పర్సన్ వై ఉదయ్ కుమార్ రెడ్డి గారు పాఠశాల ఓల్డ్ స్టూడెంట్ మరియు పాఠశాల కు అవసరమైన అన్ని అవసరాలకు అనుగుణంగా పాఠశాలకు తోడ్పాటు అందిస్తున్న ఓల్డ్ స్టూడెంట్ ఈ వినోద్ కుమార్ రెడ్డి గారు మరియు మన పాఠశాలలో 8 సంవత్సరాల సుదీర్ఘంగా పనిచేసే రిటైర్డ్ అయినటువంటి గణిత ఉపాధ్యాయుడు ఈ రమేష్ బాబు సార్ గారు మరియు పేరెంట్స్ కమిటీ సభ్యులు గ్రామస్తులు ముఖ్యంగా పిల్లల యొక్క తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయడం జరిగింది. ఇందులో భాగంగా పిల్లల యొక్క తల్లిదండ్రులకు కొన్ని కల్చరల్ ఆక్టివిటీస్ నిర్వహించడం జరిగింది దానిలో మహిళలకు మ్యూజికల్ చైర్స్ పురుషులకు నిర్వహించడం జరిగింది తదుపరి కార్యక్రమంలో ప్రభుత్వం చేపట్టి తల్లికి వందనం కార్యక్రమం కావచ్చు ఈ కార్యక్రమం యొక్క మెగా ఫ్యాన్స్ కమిటీ మీటింగ్ యొక్క ఉద్దేశాలను పాఠశాల యొక్క గత సంవత్సర నివేదికను పాఠశాలలో నిర్వహించిన ఆక్టివిటీస్ ను చక్కగా వివరించిన తదుపరి పార్టిసిపేట్ చేసినటువంటి తల్లిదండ్రులకు బహుమతులు అలాగే గ్రీన్ పాస్పోర్ట్ లో భాగంగా పిల్లలు మొక్కలు ఇప్పిచ్చి వాడిని పాఠశాల ఆవరణంలో నాటడం మరియు దాని యొక్క ఆవశ్యకత పిల్లలకు తెలియజేయడం జరిగింది చివరగా పిల్లలతో పాటు సంతోషంగా తల్లిదండ్రులు పాల్గొని పాఠశాలకు తల్లిదండ్రుల నుంచి కొన్ని సూచనలు సలహాలతో పాటు విద్యా ప్రమాణాలను మెరుగుపరిచే విషయాల గురించి చర్చించిన తదుపరి కార్యక్రమాన్ని ముగించడం జరిగినది చివరగా మధ్యాహ్న భోజనాన్ని సంతోషకరమైన వాతావరణంలో పిల్లలతో పాటు విచ్చేసినటువంటి పేరెంట్స్ కూడా భోజనం చేసి ఇళ్లకు వెళ్లడం జరిగింది ఇంతటితో ఈ కార్యక్రమం ముగిసింది.






