గరుడ ప్రతినిధి
చౌడేపల్లి జూలై 10
చౌడేపల్లి మండలంలో మెగా పేరెంట్స్ టీచర్ సమావేశాలు వైభవంగా జరిగాయి శెట్టిపేట పంచాయతీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మేకల చిన్నేపల్లిలో గురువారం మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల టిడిపి నాయకురాలు విజయలక్ష్మి ప్రదీప్ రాజు హాజరై ప్రభుత్వం పాఠశాలల విద్యార్థులకు అందిస్తున్న తల్లికి వందనం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర సామాగ్రి మొదలైన వాటిని సద్వినియోగం చేసుకొని విద్యార్థుల విద్యాభివృద్ధికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని తెలియజేయస్తూ, తల్లిదండ్రులకు నిర్వహించిన ఆటల పోటీలలో విజేతలైన వారికి బహుమతులను అందజేయడం జరిగినది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు పాఠశాలను తరచూ సంప్రదిస్తూ విద్యార్థుల నమోదు, హాజరు పెంచుటలో మరియు పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరడం జరిగినది. ఎస్ టి యు చౌడేపల్లి అధ్యక్షులు లింగమూర్తి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి, పెంచి పర్యావరణాన్ని కాపాడాలని కోరడం జరిగినది.ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి, మహిళలకు ముగ్గుల పోటీలు, మ్యూజికల్ చైర్స్, పురుషులకు తాడు లాగుట ఆటలను నిర్వహించి , అందరూ కలిసి డొక్కా సీతమ్మ మధ్యాహ్న సహపంక్తి భోజనం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాఠశాల దాత, టిడిపి నాయకులు నారాయణ రాజు పరిశీలకులు మణి పాఠశాల ఉపాధ్యాయులు లింగమూర్తి, గోవిందు, మోహన్, రామకృష్ణ, విజయశ్రీ, మనోహర రాణి, చంద్రశేఖర్, నాగముణి కృష్ణ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు




