మాతృమూర్తులకు విద్యార్థులు పాదాభివందనం పండుగ వాతావరణంలో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం

Sesha Ratnam
2 Min Read
ప్రసంగిస్తున్న టిడిపి మండల అధ్యక్షుడు సుబ్బారెడ్డి.

జూలై 10వ తేదీ ( గరుడ న్యూస్): మెగా పేరెంట్స్ టీచర్స్ మీటిలో పాల్గొన్న నాయకులు,అధికారులు. బ్రహ్మంగారిమఠం, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చేపట్టిన మెగా పేరెంట్స్, టీచర్స్, మీట్ 2.0 కార్యక్రమాన్ని బి మఠం మండలంలోని జిల్లా పరిషత్ గోవిందమాంబ బాలికోన్నత పాఠశాలలో ప్రజా ప్రతినిధులు అధికారులు భాగస్వాములై మాతృమూర్తులకు విద్యార్థుల చేయడంతో  కార్యక్రమం పండుగ మంచి వాతావరణంలో సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో అబ్జర్వర్ గా మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ పుల్లయ్య ప్రజా ప్రతినిధులు తెలుగుదేశం పార్టీ బ్రహ్మంగారిమఠం టిడిపి అధ్యక్షులు, టిడిపి నాయకులు పూజా శివ, సాంబశివరెడ్డి, సుధాకర్, మండల ఎంపీపీ సి వీరనారాయణరెడ్డి, స్థానిక సర్పంచ్ సుదర్శన్ రెడ్డి, ఎంపీటీసీ మనోహర్, బాలికల ఉన్నత పాఠశాల స్థల  దాత  వీరభద్ర స్వామి ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ పిల్లల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సమన్వయంతోనే విద్య పురోగతిని సాధించడానికి ఎంతో అవకాశం ఉంటుందని విద్యార్థులు క్రమశిక్షణతో, పట్టుదలతో చదివితే తప్ప ఉన్నత స్థానాలకు చేరుకోవడం కష్టతరమని విద్యపై విద్యార్థులకు ఎంత శ్రద్ధ ఉందో పేరెంట్స్ ఉపాధ్యాయులకు అంతే శ్రద్ధతో విద్యార్థుల పట్ల అంకితభావం కలిగి ఉండాలని టిడిపి మండల అధ్యక్షులు సుబ్బారెడ్డి, పూజా శివ, సాంబశివారెడ్డి ప్రసంగించడం జరిగింది. లెక్కల కొండారెడ్డి మాట్లాడుతూ 2024 -25 సంవత్సరములో బ్రహ్మంగారి మఠము మండల ప్రభుత్వ పాఠశాలలో మొదటి స్థానం నవ్యశ్రీ 566, రెండవ స్థానం557 మార్కులతో కే గురుపవిత్ర రావడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో బ్రహ్మంగారిమఠం మండలంలో సైనిక్ స్టార్స్ అవార్డు  కె గురుపవిత్ర కే జోష్ణ కడప జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా 20 వేల రూపాయలు ప్రైజ్ మనీ ప్రశంసా పత్రమును  అవార్డును అందుకోవడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులైన ఓ లక్ష్మణ స్వామి రెడ్డి పాఠశాల ఉపాధ్యాయులైన వై విజయలక్ష్మి, తెలుగు ఉపాధ్యాయులు లెక్కల కొండారెడ్డి, పిడి పుష్పలత, ఇంగ్లీషు ఉపాధ్యాయులు సంధ్యారాణి హిందీ ఉపాధ్యాయులు చెన్నమ్మ, సోషల్ ఉపాధ్యాయులు ఎలిజిబెత్ రాణి, మ్యాథ్స్ టీచర్ సుమతి, శివప్రసాద్ రెడ్డి ఓబులేసు, జి కమాల్బి పాల్గొన్నారు.పాఠశాలకు ఓ లక్షల స్వామి రెడ్డి జూన్ ఒకటవ తేదీన ప్రధానోపాధ్యాయులుగా రావడం జరిగింది పాఠశాల అభివృద్ధి కోసం విద్యార్థుల విద్యార్థుల కనీస అవసరాలు అయినా మినరల్ వాటర్ బాత్రూములకు పైపులైను విద్యార్థులకు ప్లేట్లు శుభ్రం చేసుకుని దానికి కొళాయిలు ఏర్పాటు చేసి ఆట స్థలంలో చెట్లను నాటించి సుమారు దాదాపు రెండు లక్షల రూపాయలు పాఠశాలకు తమ సొంత నిధులు వినియోగించాడు ,తెలుగు ఉపాధ్యాయ లెక్కల కొండారెడ్డి తెలియజేశాడు.

తల్లిదండ్రులకు స్వాగతం పలుకుతున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు.
TAGGED:
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *