గరుడ న్యూస్, సాలూరు
స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల సాలూరు లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ఆదేశాలు ప్రకారం మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్, తల్లికి వందనం ఘనంగా నిర్వహించారు ..ప్రధాన ఉపాధ్యాయురాలు ఎన్. జ్యోతి 1928 వ సంవత్సరం లో స్థాపించబడిన ఈ పాఠశాల నుండి ఎంతోమంది విద్యార్థులు కలెక్టర్ లు గా డాక్టర్ లు గా, ఇంజనీర్స్ గా, జడ్జీలు, లాయర్ లు,జర్నలిస్టులు, టీచర్స్ వ్యవస్త ను పరిపాలించే రాజకీయ నాయకులు గా ఉన్నారు అని చెపుతూ, ప్రతీ సంవత్సరం మా పాఠశాల నుండి ప్రతిభా అవార్డ్స్, ఇన్స్పైర్ అవార్డ్స్ కి మా విద్యార్థులు ఎంపిక అవుతారని, పదవతరగతి ఉత్తీర్ణత 90 శాతం పైనే ఉంటుందని చెప్పారు… పాఠశాల సీనియర్ ఉపాద్యాయులు కె. వీ. సత్యనారాయణ మాష్టారు
నేటి విద్యార్థులే రేపటి పౌరులు వారిని సరి అయిన మార్గం లో తయారుచేసే బాధ్యత తల్లిదండ్రులు మరియు గురువులదే …వీరి ఇరువురి ఆశీస్సులు, బాధ్యత తో కూడిన కృషి ఉన్నట్లయితే తప్పకుండా రేపటి సమాజంలో మన రాష్ట్రం ప్రపంచంలో నే ముందుంటుందని తను కుడా ఈ పాఠశాల లోనే చదివి ఇక్కడే బోధించటం సంతోషంగా ఉందని తెలిపారు..
పాఠశాల లో ప్రభుత్వ విట్నెస్ మరియు ముఖ్య అతిథిగా ఈ పాఠశాల లోనే చదివి న కొల్లి తిరుపతి వ్యవసాయ అధికారి విద్యార్థులు ను ఉద్దేశించి మారుమూల గ్రామంలో చదివే ప్రతాప్ ఈ రోజు వైజ్ఞానిక వైఖరి తో ఆలోచించి జపాన్ లో తను తయారుచేసిన డ్రోన్ టెక్నాలజీ ప్రదర్శించి ప్రపంచ స్థాయిలో అభినందించబడి భారతదేశ కీర్తి ను వ్యాపింపజేసి ఇష్రో లో డ్రోన్ సైంటిస్ట్ గా ఉండటం మీ అందరికీ ఒక ప్రేరణ అని చెప్పారు …
అనంతరం తలిదండ్రులకు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు ఆటల పోటీలు నిర్వహించి బహుమతి ప్రదానం చేసారు..
ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 2.0 లో విద్యార్థులతో ఉపాధ్యాయులు, తలిదండ్రులు సహపంక్తి భోజనం చేశారు.






