


తిరుపతి జిల్లా, రేణిగుంట మండలం గరుడ న్యూస్ రిపోర్టర్ పాకాల మురళి: సుపరిపాలన తొలి అడుగు: ఇంటింటికీ అభివృద్ధి, కరపత్రాలతో వెళ్లి ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే. తుడా నిధులతో జ్యోతి నగర్ ను మరింత అభివృద్ధి చేస్తా, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై ప్రజలకు, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని స్పష్టం చేసిన ఎమ్మెల్యే. ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని అన్నారు. తల్లికి వందనం, దీపం పథకం, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, రైతు సంక్షేమం, ఉచిత సిలిండర్లు,యువతకు ఉద్యోగాల కల్పన, వంటి కీలక కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసిందని, ఆయన పేర్కొన్నారు. అలాగే వర్షం పడితే ,జ్యోతి నగర్ జలమయం అవుతుందని తుడా నిధులతో, రెండు నెలలలో,జ్యోతి నగర్అభివృద్ధి చేస్తానని, హామీ ఇచ్చారు. సిసి రోడ్లు, డ్రైనేజీ సమస్య ప్రధానంగా ఉన్నాయని వాటినీ, పరిష్కరించాలని, అధికారులను ఆదేశించారు. సుపరిపాలన అందిస్తూ కూటమి ప్రభుత్వం తొలి అడుగు పూర్తి చేసుకుందని తెలిపారు.. ఈ కార్యక్రమంలో రేణిగుంట ఎమ్మార్వో చంద్రశేఖర్ రెడ్డి, ఈవో పి ఆర్ డి, ముని చంద్రారెడ్డి, మునుస్వామి నాయుడు, డి పుష్పనాధన్ , పట్టణ అధ్యక్షుడు మాభాష, శివయ్య నాయుడు, కొరియర్ రవి, ఎలుమలై, బాబు, చైతన్య, మేరీ, మైనారిటీ నాయకులు నవాబ్, సంపత్, ప్రభు,రేణిగుంట తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.



