




చిత్తూరు జిల్లా, కుప్పం గరుడ న్యూస్ ప్రతినిధి:- ఆర్ మంజునాథ్:
కుప్పంలో నేడు సత్య సాయి ప్రవాహిని రథయాత్ర ప్రారంభం శ్రీ సత్య సాయి బాబా వారి శత జయంతి వేడుకలు పురస్కరించుకుని శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని రథయాత్ర ప్రారంభం. నేడు అనగా 15వ తాది మంగళవారం గుడుపల్లి, కుప్పం, శాంతి పురం మండలాల్లో సాగనుందని కుప్పం సత్యసాయి సేవాసమితి అథ కన్వినర్ 6.5. నాగేంద్ర కుమార్ తెలిపారు. మంగళవారం ఉదయం ద్రవిడయూనివర్సిటీ నుండి గుడుపల్లి ల గ్రామాలలోను తర్వాత కుప్పం పట్టణం వీధులలోను సత్య సాయి రథయాత్ర జరుగుతుందన్నారు. తర్వాత శాంతిపురం మీదుగా V.కోట వెళ్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు శ్రీ సత్య సాయి సేవాసంస్థలు అధ్యక్షులు మధు సూదనం, వారి సభ్యులు కుప్పం సమితి భక్త సభ్యులందరూ పాల్గొంటారని తెలిపారు.
