ఆర్టీఐ లైవ్ న్యూస్,సాలూరు ప్రతినిధి
పార్వతీపురం మన్యం జిల్లా, సాలూరు నియోజకవర్గం, పాచిపెంట మండలం, పాంచాలి గ్రామంలో
గ్రామ సంరక్షణ నిధి ఒక ప్రభుతేత్వర సంస్థ విద్య, ఆరోగ్యం, గో రక్ష, సేంద్రియం, ఉపాధి, భారతీయత, రక్షణ ఆధ్యాత్మికం మరియు ధర్మం వంట గ్రామ హిత పలు రంగాల్లో క్రమ పద్ధతి గా పనిచేస్తుంది…. ఇందులో భాగంగా సేంద్రియ నిమిత్తము వాలేటి తిరుపతి నాయుడు ఉమాదేవి దంపతులు నాలుగు ఎకరాలు సేంద్రియ వ్యవసాయంకు సమర్పణ చేయగా అందులో 3.5 ఎకరాలు వరి పండించిగా 80 బస్తాలు పండించడం జరిగింది…
పిమ్మట ధాన్యం బియ్యం చేసి సంస్థ ప్రారంభ ప్రముఖులకు, కార్యకర్తలకు సహకార్యకర్తలకి వితరణ కార్యక్రమం పాంచాలి గ్రామం శివాలయంలో జరిగింది..
ఈ వితరణ కార్యక్రమంకు
గ్రామ వికాస్ ఆంధ్రప్రదేశ్ సంయోజక్ తిరుపతయ్య విజయవాడ విద్యా వేత్త ఆంధ్రప్రదేశ్ సహా సంయోజక్ ఏ. వి.రెడ్డి నాయుడు
యలమంచిలి హాజరు అయి వితరణతో పాటు కార్యకర్తలకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.






