గరుడ న్యూస్ పుంగనూరు. పుంగనూరు పట్టణంలోని స్థానిక ఆర్టీసి డిపోలో కూటమి ప్రభుత్వం ఆర్టీసి కార్మికులను రకరకాలుగా వేదిస్తుండటంతో కొంత మంది కార్మికులు భయంతో తల్లడిల్లిపోతున్నారు. వాస్తవాలను గుర్తించాల్సిన అధికారులు సైతం చూసిచూడనట్లు ఉండటంతో కొంత మంది కార్మికులు ఆత్మహత్యలే శరణ్యమంటు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం దిలీప్‌కుమార్ అనే డ్రైవర్ వైఎస్సార్ ఎంప్లాయిస్ యూనియన్‌లో చురుగ్గా కొనసాగుతున్నాడు. ఇలా ఉండగా అతనిపై కొంత మంది అధికార పార్టీకి చెందిన కార్మికులు రకరకాల ఆరోపణలు చేస్తూ అతనిని అనేక వేదింపులకు గురి చేస్తున్నారు. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడంతో తనకు ఆత్మహత్యలే శరణ్యమంటు విలపిస్తున్నాడు. ఈ విషయమై వెంటనే అధికారులు స్పందించి, రాజకీయ వేదింపులకు ఆర్టీసి కార్మికులు గురికాకుండ చూడాలని పలువురు కోరుతున్నారు.



