

గరుడను ,ప్రతినిధి రాజేష్
చంద్రగిరి నియోజకవర్గ పరిధి పాకాల మండలంలోని పంటపల్లి పంచాయతీ జయదేవ్ పురం కాలనీలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని.
కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే గారికి కర్పూర హారతులతో ఘన స్వాగతం పలికిన మహిళలు, నాయకులు, కార్యకర్తలు.
సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం ద్వారా నియోజక అభివృద్ధిని మరింత వేగవంతం చేద్దాం : చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని.
మీ సమస్యలు తెలుసుకొని సత్వర పరిష్కారం కోసమే ఈ కార్యక్రమం… ప్రజా పాలనలో మరింత మెరుగు కనబరుస్తాం.
మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయ సాధనలో భాగస్వామ్యం అవుదాం.
మన భావితరాల పురోగాభివృద్ధి కోసమే చంద్రబాబు నాయుడు గారి తాపత్రయమంతా : పులివర్తి నాని
గ్రామంలోని ఇంటి ఇంటికి వెళ్లి చంద్రబాబు నాయుడు గారి పాలనలో చేసిన రాష్ట్ర, నియోజకవర్గ అభివృద్ధిని తెలిపే కరపత్రాలు పంచుతూ కొనసాగుతున్న కార్యక్రమం.
పంటపల్లి పంచాయతీ పరిధిలో ఇప్పటివరకు జరిగిన, ఇకపై జరగబోయే అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలు వివరంగా తెలుసుకుంటూ కొనసాగుతున్న కార్యక్రమం.
ప్రజల నుంచి తెలుసుకున్న సమస్యలను కొన్నింటిని అక్కడికక్కడే అధికారుల ద్వారా పరిష్కరిస్తూ.. మరికొన్ని సమస్యలను త్వరితగతంగా పరిష్కరించాలని వారిని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



