
ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు కృత్యదార బోధన…!!
మహబూబాబాద్ బ్యూరో జులై 15 (గరుడ న్యూస్)
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు ఆదర్శ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులు భారతదేశ భౌగోళిక స్వరూపాలు పాఠ్యాంశాన్ని వివిధ భౌగోళిక అంశాలను పాఠశాల ఆవరణలో ప్రాజెక్టు రూపకల్పన చేయడం జరిగింది. సి సి ఈ విద్యా విధానానికి అనుగుణంగా విద్యార్థులు దేశంలో గల నైసర్గిక స్వరూపాలైన హిమాలయాలు, ఎడారులు, పీఠభూములు, గంగా సింధు మైదానాలు, ద్వీపకల్పములను నదులు పరివాహక ప్రాంతాలను మట్టి, గులకరాళ్ళ ఇసుకతో తయారుచేసి పాఠశాలలో ఉన్న విద్యార్థులకు అర్థమయ్యే విధంగా ఈ ప్రాజెక్టును వివరించారు. ఈ కార్యక్రమంలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు టి .సతీష్, ఎండి నూరుద్దీన్, బి. దేవేందర్ మరియు ప్రిన్సిపల్ జి. ఉపేందర్ రావు విద్యార్థులను అభినందించారు . ఉపాధ్యాయుని ,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
