
సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,జులై16,(గరుడ న్యూస్ )

సంస్థాన్ నారాయణపురం లో
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాధగోని జంగయ్య గౌడ్,జన్మదినవేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ జన్మదిన వేడుకలు మునుగోడు నియోజకవర్గం మైనార్టీ నాయకుడు యండి.రహీం షరీఫ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా
ముందుగా జంగయ్య గౌడ్ కు మూడు రంగుల తలపగా పెట్టీ
కేక్ కట్ చేయించి శాలువాతో ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో
మంచాల మండలం కాంగ్రెస్ పార్టీ,కిసాన్ సెల్ అధ్యక్షుడు
కావాలి బుగ్గ రాములు ముదిరాజ్,సంస్థాన్ నారాయణ పురం మండలం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వీరమల్ల వెంకటేష్ గౌడ్,జక్కిడి బాల్ రెడ్డి,రత్తుపెల్లి యాదయ్య,రాసల్ల వెంకటేష్,అందే యాదయ్య యాదవ్,శంకర్ గౌడ్,యండి.వాజిధ్,తదితరులు పాల్గొన్నారు.

