ఎరువులు , మందుల దుకాణాలపై విజిలెన్స్ దాడులు

G Venkatesh
1 Min Read

గరుడ న్యూస్. పుంగనూరు పట్టణంలోని ఎరువులు , మందుల దుకాణాలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. బుధవారం విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్‌ రవి, తిరుపతి వ్యవసాయశాఖ సంచాలకులు ధనుంజయరెడ్డి, స్థానిక వ్యవసాయాధికారులు రాధా, జ్యోతమ్మ కలసి పట్టణంలోని ఎరువులు, మందులు , విత్తనాల దుకాణాలపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా స్టాక్‌ నిల్వలు, బిల్లులు, ధరల పట్టిలను పరిశీలించారు. అధికారులు మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం నిర్ధేశించిన మేరకు ఎరువులు, మందులు, విత్తనాలు పంపిణీ చేయాలని, అధిక ధరలకు విక్రయించిన, బిల్లులు ఇవ్వకపోయిన , స్టాక్‌ ఉన్న లేదని డిమాండ్‌ సృష్టించిన క్రిమినల్‌ కేసులు నమోదు చేసి, షాపులు సీజ్‌ చేసి, లైసెన్సులు రద్దు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా పలు దుకాణాలలో శ్యాంపుల్స్ సేకరించి, పరీక్షలకు పంపారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *