
రాష్ట్రంలో దౌర్జన్యాలు దాడులు తప్ప ప్రజల సంక్షేమం పట్టని కూటమి ప్రభుత్వం – పరీక్షిత్తు రాజు

రాష్ట్ర ప్రజలకు మేలు జరిగేలా ప్రజల పక్షాన నిలిచి పోరాడే ఏకైక పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ – మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు
పార్వతీపురం నియోజకవర్గ కేంద్రంలో పార్వతిపురం పురపాలక సంఘం మరియు మండల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు అధ్యక్షతన గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా అరకు ఎంపీ గుమ్మా తనుజరాణి, జిల్లా పార్టీ అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్ రాజు, రాష్ట్ర వైసిపి కార్యదర్శి మాజీ తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్ పాల్గొనగా బాబు షూరిటీ మోసం గ్యారంటీ – చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ కార్యక్రమం లో వందలాది మంది పార్టీ శ్రేణులు సమక్షంలో క్యూ అర్ కోడ్ ను ప్రదర్శించి ఘనంగా నిర్వహించారు.
ఎంపీ తనుజ రాణి మాట్లాడుతూ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఈ సమావేశం నియోజకవర్గ స్థాయిలో ఘనంగా ప్రారంభము చేసుకోవడం జరిగింది అని నేడు మూడో దశ కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త అలజంగి జోగారావు సారధ్యంలో మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం నిర్వహణ చేపట్టడం అందులో మీరంతా పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడం అభినందనీయం అని తెలిపారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా డక్ అవుట్ అయ్యారు అని తెలిపారు.

జిల్లా పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఈ నెల 21 నుంచి గ్రామంలో, వార్డులో ఎంపిక చేసిన ప్రాంతంలో రచ్చ బండ మాదిరిగా కుర్చీలు వేసుకుని, వారికి వివరించేలా చేయాలి అని కేడర్ కు దిశానిర్ధేశం చేస్తూ ఆ కార్యక్రమంలో జగన్ 35 నిమిషాల వీడియో లేదా, ఆడియోను వారికి వినిపించాలి. అలాగే నాడు చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన బాండ్లను చూపించడంతో పాటు, ఎంత నష్టం కలిగిందీ అన్న విషయం వాళ్ళకి స్పష్టంగా తెలిపి చంద్రబాబు ప్రజలకు చేస్తున్న మోసాన్ని తెలుసుకుని ప్రజలే కూటమి నాయకుల్ని ప్రశ్నించేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని తెలిపారు.



