గరుడ ప్రతినిధి
చౌడేపల్లి జూలై 17
శక్తి క్షేత్రం బోయకొండ గంగమ్మ ఆలయంలో అంబులెన్స్ ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర బీసీ ఐక్యవేదిక సంఘ నాయకులు ఈవో ఉప కమిషనర్ ఏకాంబరంకు వినతిపత్రం అందించారు ఇటీవల కాలంలో తమ సమీప బంధువు గంగమ్మ ఆలయం కు వచ్చేందుకు కొండను ఎక్కుతుండగా ఒక్కసారిగా కుప్పకూలి పడ్డాడని ఆ సమయంలో ఎలాంటి వాహనాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డామని వారు అన్నారు అధిక ఖర్చుతో కూడిన వాహనంను తీసుకుని వెళ్లి అతని ప్రాణాలను రక్షించుకున్నామని ఈ సందర్భంగా వారున్నారు బోయకొండకు అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారని భక్తుల సౌకర్యార్థం అంబులెన్స్ ఏర్పాటు చేయాలన్నారు ఇందుకోసం ఆలయానికి తమ వంతు సాయం చేస్తామని వారు ఉప కమిషనర్ ఏకాంబరంకు వినతి పత్రం అందిస్తూ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ ఐక్యవేదిక సంఘ అధ్యక్షుడు జన్నే రాజేంద్రనాయుడు యువజన అధ్యక్షుడు ఆవుల విశ్వనాథ నాయి బ్రాహ్మణ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం గంగులప్ప తదితరులు పాల్గొన్నారు



