
గరుడ ప్రతినిధి చౌడేపల్లి జూలై 17
మండల కేంద్రమైన చౌడేపల్లి లో కూటమి తెలుగుదేశం ప్రభుత్వం సంవత్సరం పూర్తయిన సందర్భంగా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు సింగల్ విండో అధ్యక్షుడు హరి రాయల ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు అంతేకాకుండా ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పింఛన్లు వంటివి అర్హులైన వారికి అందిస్తామని ఈ సందర్భంగా హరి రాయల్ అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు విద్యాసాగర్ కార్తీక్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు
