గరుడ ప్రతినిధి
చౌడేపల్లి జూలై 19
చిత్తూరు జిల్లా, చౌడేపల్లి మండలం, చిట్రెడ్డిపల్లి
అతివేగం తో,ఓవర్ లోడ్ వలన బోలెరో బోల్తా, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం చౌడేపల్లి వైపు నుండి పలమనేరు వైపు వెళ్తున్న బోలెరో ఏపి 39 యూ.యల్ 0207 నెంబర్ ఖల బోలెరో వాహనం అతి వేగంగా వచ్చి చిట్రెడ్డిపల్లి నాగలరాళ్ళు డౌన్లో బోల్తా పడింది. స్థానికులు హుటాహుటిన అక్కడికి వెళ్ళి చూడగా డ్రైవర్ కు ఎటువంటి గాయాలు లేవు. ఈ వాహనం లో గల టమాటా కాయలు చౌడేపల్లి మండలం, పరికిదొన గ్రామపంచాయతీ, ఏపూరివాని పెంటకు చెందిన మదుసూధన్ రెడ్డి కి చెందినవని, అతను టమాట పంటను కర్ణాటక రాష్ట్రం కోలార్ కు చెందిన వ్యాపారస్తుడికి అమ్మినట్లు తెలిపారు. వాహనం పెద్దపంజాణి మండలం ముత్తుకూరు కు చెందినదని, అతివేగం, మరియు ఓవర్ లోడ్ వలన వాహనం అదుపు తప్పిందని డ్రైవర్ తెలిపాడు.





