
ఆత్మీయ సమ్మేళనం అట్టర్ ప్లాప్.
ఆత్మీయ సమ్మేళనం అంటే అర్థం ఏమిటి భూపాల్ నాయక్ జి. జర్నలిస్టులతోటి ఆత్మీయ సమ్మేళనం అసలు జరిగిందా?
భూపాల్ నాయక్ ఏమి ఆశించి ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు? జర్నలిస్టు జర్నలిస్టు కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చేస్తాను అన్న భూపాల్ నాయక్.
గత ఎలక్షన్ల కంటే ముందు ఇదే మాట చెప్పినట్లు గుర్తు. మరి జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ పాలసీ ఈనాటి వరకు కూడా అయ్యిందా? అదే మాటను ఇప్పుడు చెప్పాడు ఇది ఎప్పుడు అవుతుంది.?
గతంలో ఇచ్చిన హామీ తుంగలో తొక్కినట్టేనా?. నిజంగా భూపాల్ నాయక్ జర్నలిస్టుల మంచి గురించి ఆలోచించే వాడే అయితే ఈ నాసిరకం హెల్మెట్లు ఇచ్చేవాడా?.
జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనం అని చెబుతూ, తన వ్యాపార అభివృద్ధి గురించి జరిగిన సమావేశం లాగా కనిపించింది. అని విలేకరులు గుసగుసలాడటం వినిపించింది. భూపాల్ నాయక్ జి
ఆత్మీయ సమ్మేళనం అంటే దాని నిర్వచనం తెలుసా?.
_భూపాల్ నాయక్ జి మీ రాజకీయ, వ్యాపార ప్రయోజనాల కోసం ఆత్మీయ సమ్మేళనం పేరుతో జర్నలిస్టులనుమోసగించకండి.
మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి, జూలై 20, (గరుడ న్యూస్)
మహబూబాబాద్ జిల్లాలో కొరివి మండల పరిధిలోని కందికొండలో తన వ్యవసాయ క్షేత్రంలో కిసాన్ పరివార్ అధినేత ననావత్ భూపాల్ నాయక్ జిల్లాలోని పత్రికా విలేకరులతో ఆత్మీయ సమ్మేళనం పేరుతో గత వారంలో ఒక ప్రకటన జారీ చేయడం జరిగింది.దీనికి సంబంధించి ఈరోజు జిల్లాలోని పలు మండలాలలో ఉన్న పాత్రికేయులు భూపాల్ నాయక్ వ్యవసాయ క్షేత్రానికి తరలి వెళ్లారు. మధ్యాహ్నం ఒంటిగంటకు పాత్రికేయుల సమావేశం లో భూపాల్ నాయక్ మాట్లాడుతూ, పాత్రికేయులకు, పాత్రికేయుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ పాలసీని చేపిస్తానని అంటూ తన వ్యాపార అభివృద్ధికి సంబంధించిన సమస్యలపై మాట్లాడారు. గత సమావేశాలలో కూడా జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ పాలసీ ఇప్పిస్తానని అన్నారే కానీ ఇంతవరకు అతీగతీ లేదని కొందరు జర్నలిస్టులు గుసగుసలాడుతున్నారు. అసలు భూపాల్ నాయక్ కు ఆత్మీయ సమ్మేళనం అంటే ఏందో తెలుసా? అంటూ మరికొందరు జర్నలిస్టులు అనుకోవడం వినిపించింది.
గతంలో జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి మళ్లీ 10 లక్షల ఇన్సూరెన్స్ పాలసీ హామీని,అదే మాట అనడం హాస్యాస్పదంగా ఉంది అని జర్నలిస్టులు చెవులు కోరుకున్నారు. దూర ప్రాంతాల నుండి భూపాల్ నాయక్ పై అభిమానంతో వచ్చిన జర్నలిస్టులు తన బైక్లలో కార్లలో పెట్రోల్ పోయించుకొని వ్యయ ప్రయాసల కోర్చి సమావేశానికి హాజరైనారు. చివరకు జర్నలిస్టులకు నాసిరకం హెల్మెట్లను ఇచ్చారని విమర్శిస్తూ, తన వ్యాపార అభివృద్ధికి రియల్ ఎస్టేట్ వ్యాపారులను పిలిపించుకొని జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనాన్ని అవమానపరుస్తూ సమావేశం ముగించారు.
