
గరుడ ప్రతినిధి
చౌడేపల్లి జూలై 20
రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి అరెస్టు రాజకీయ కుట్రలో భాగమేనని వైసిపి మండల అధ్యక్షుడు నాగభూషణ రెడ్డి అన్నారు మద్యం కుంభకోణం లో ఎంపీ వెంకట మిధున్ రెడ్డి పాత్ర ఉందని ఆరోపిస్తూ సిట్ అధికారులు అరెస్టు చేసిన విషయం విధితమే ఇందుకు నిరసనగా ఆదివారం వైకాపా ఆధ్వర్యంలో స్థానిక వెంకటరమణ భవనం నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నాగభూషణ రెడ్డి ప్రసంగిస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటినుంచి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం పైన కక్ష సాధింపు చేస్తున్నారని విమర్శించారు ఇందులో భాగంగానే మద్యం కేసులో అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు ఇలాంటి చర్యలు ప్రభుత్వం మానుకోవాలని అన్నారు ప్రజలు గమనిస్తూనే ఉన్నారని ఇకపై ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదని అన్నారు ఇటీవల బంగారు పాల్యంలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన సందర్భంలో రైతులు ప్రజలు అధిక సంఖ్యలో నీరాజనాలు పలికారని రాబోయే కాలంలో వైసిపి మరింత పుంజుకుంటుంది అనడానికి ఇదే నిదర్శనం అన్నారు ఇకనైనా కూటమి ప్రభుత్వం రాష్ట్ర మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై కేసులు బనాయించడం మానుకోవాలని ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైసీపీ ఉపాధ్యక్షుడు చౌడేపల్లి జడ్పిటిసి నడింపల్లి దామోదర్ రాజు బోయకొండ మాజీ చైర్మన్ మిద్దిన్టి శంకర్ నారాయణ మాజీ ఎంపీపీలు అంజిబాబు రుక్మిణమ్మ రాష్ట్ర వైసీపీ విద్యార్థి విభాగ సంయుక్త కార్యదర్శి కళ్యాణ్ భరత్ మండల ఉపాధ్యక్షుడు నరసింహులు యాదవ్ గ్రీవెన్స్ సెల్ జిల్లా కార్యదర్శి పవన్ రాయల్ మండల వైసీపీ కార్యదర్శి నాగరాజా మోహన్ రాయల్ వెంకటరమణ మండలంలోని వైకాపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
