
గరుడ ప్రతినిధి
చౌడేపల్లి జూలై 20
శక్తి క్షేత్రం బోయకొండ గంగమ్మ ను మదనపల్లి జూనియర్ సివిల్ జడ్జి కీర్తన దర్శించుకున్నారు ఆలయ ఉప కమిషనర్ ఈవో ఏకాంబరం సాదరంగా ఆహ్వానం పలికి అమ్మవారి దర్శనభాగం కల్పించారు అనంతరం వేద ఆశీర్వాదం పవిత్ర తీర్థ ప్రసాద వినియోగం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ అధికార అర్చక సిబ్బంది పాల్గొన్నారు అదే విధంగా నంద్యాలకు చెందిన ఫారెస్ట్ రేంజర్ ఈశ్వరయ్య మహేశ్వరమ్మలు గో సంరక్షణ పథకానికి గాను రూ 69200లు విరాళంగా అందించారు వీరిని సైతం ఆలయ మర్యాదలతో సత్కరించి అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు
