
పార్వతీపురం, గరుడ న్యూస్ : వేతనాలు పెంచాలని,ఆశ వర్కర్లుగా గుర్తించాలని, యూనిఫామ్ దుస్తులు అందించాలని కోరుతూ ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్రకు కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ వినతిపత్రం సమర్పించారు. ఆదివారం ఉదయం టిడిపి పార్టీ కార్యక్రమంలో ఎమ్మెల్యేని కలిసి తమ సమస్యలనువిన్నవించారు. ఆశ వర్కర్ల మాదిరిగా తాము కూడా అనేక ప్రభుత్వ సేవల్లో పాల్గొంటున్నామని, అయినా చాలీచాలని వేతనాలు మాత్రమే ఇస్తున్నారని ఎమ్మెల్యేకు వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ వినతని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.



