
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. బలిజిపేటలో సోమవారం మధ్యాహ్నం సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి కార్యక్రమంలో భాగంగా బలిజిపేట వీధిలో ఇంటింటికి వెళ్లి తెదేపా ముద్రించిన కరపత్రాలను పంపిణీ చెశారు. ఈ సందర్బంగా బలిజిపేటలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ వైసీపీ పార్టీ శవ రాజకీయాలు చేసినందునే 151 నుంచి 11 సీట్లకు దిగిపోయారని ఎద్దేవా చేశారు. వైసీపీ పాలించిన ఐదేళ్ళు చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. వైసీపీ నాయకులు ఇంటింటి ప్రచారానికి వస్తే తెలుగు దేశం చేసిన అభివృద్ధి గురించి తెలియజేసి వారిని నిలదీయాలన్నారు. అన్నం పెట్టె అన్నా కాంటీన్లను కూల్చివేసి చరిత్ర హీనుడయ్యారన్నారు. గత ప్రభుత్వం ఒకరికే అమ్మబడి పథకాన్ని ఇస్తే తమ ప్రభుత్వం లో ఇంటిలో ఉన్న అర్హులందరికీ తల్లి వందనం నిధులు అందజేశామ్మన్నారు. దోచుకో దోచుకో నినాధంతో గత ఎమ్మెల్యే నియోజవర్గంలో పాలన చేశారని అతనికి ప్రజలు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారన్నారు. బలిజిపేటను ధత్తత తీసుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. గ్రామంలోని అన్ని స్మశాన వాటికలను అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు బీ. రామ్మోహన్, వెంకటనాయుడు, పాపినాయుడు, రాజశేఖర్,రాంబాబు, శంకరరావు పాల్గొన్నారు.



