పంట భూముల సారాన్ని కాపాడుకునేందుకు యూరియా వాడకాన్ని తగ్గించి, పచ్చిరొట్ట నానో యూరియా వంటి వాటిపై రైతులు శ్రద్ధ పెట్టాలని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సేంద్రియ ఎరువులపై అవగాహన కల్పించే గోడపత్రికను వ్యవసాయ శాఖ అధికారులతో కలసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రసాయన ఎరువులు వాడకం వలన భూసారం తగ్గిపోవడమే కాకుండా వ్యవసాయ ఖర్చులు భారంగా మారుతున్నాయని దీనిపై రైతులు పునరాలోచించాలని అన్నారుపొలాల గట్లపై వేసుకునేందుకు వ్యవసాయ శాఖ కంది, రాగులు విత్తనాలను 100% సబ్సిడీతో అందిస్తుందని దీన్ని వ్యవసాయదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏడిఏ వెంకటేష్, ఏవోలు అవినాష్ అశోక్ లు పాల్గొన్నారు.