పార్వతీపురం మన్యం జిల్లాలోని వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలలో మెనూ సక్రమంగా అమలయ్యేలా చూడాలని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ ఓబిసి పార్వతీపురం మన్యం జిల్లా చైర్మన్ వంగల దాలినాయుడు, జిల్లా నాయకులు కోలా కిరణ్ కుమార్, మండల అధ్యక్షులు తీళ్ళ గౌరీ శంకరరావు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పార్వతీపురం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి అశుతోష్ శ్రీవాస్తవతో వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాక్షాత్తు మంత్రి, ఎమ్మెల్యే పరిశీలనలో వసతి గృహాలలో మెనూ సక్రమంగా అమలు కాలేదని రుజువైందన్నారు. కాబట్టి తక్షణమే ఆయా విద్యాసంస్థల్లో మెనూ సక్రమంగా అమలయ్యేలా చూడాలన్నారు. మెనూ అమలు కాకపోతే విద్యార్థులు రక్తహీనతకు లోనై అనారోగ్యం పాలవుతారన్నారు. జిల్లాలోని తక్షణమే అన్ని విద్యాసంస్థల్లో మధ్యాహ్న భోజన పథకంతో పాటు వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలలో మెనూ సక్రమంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీనికోసం నిరంతర పర్యవేక్షణ పెంచాలన్నారు. రోగాలు సీజన్లో విద్యార్థులు ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తాగునీరు, దోమలు, మరుగుదొడ్లు, ప్రహరీ ఏర్పాటు, కిటికీలకు మెస్ లు ఏర్పాటు తదితరవి చేయాలన్నారు. ఎందుకంటే పాఠశాలల్లోకి పాములు వచ్చి విద్యార్థులను కాటు వేసే సంఘటనలు ఉన్నాయన్నారు. ఆశ్రమ పాఠశాలలో ఏఎన్ఎం లను నియమించి విద్యార్థుల ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాది ఇప్పటికే ఇద్దరు విద్యార్థులు మృతి చెందటం బాధాకరమన్నారు. ఇకపై విద్యార్థులు మృత్యువాత పడకుండా చూడాలన్నారు. ఈ సందర్భంగా వినతిపత్రాన్ని అందజేస్తారు. దీనికి స్పందించిన ఐటీడీఏ పీవో డిడి ట్రైబల్ వెల్ఫేర్ కు పలు ఆదేశాలు జారీ చేశారు.