


గరుడ న్యూస్. ప్రతినిధి S.రాజేష్: పాకాల మండలం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారి మాతృమూర్తి, దివంగత శ్రీమతి పులివర్తి లక్ష్మీ భారతి గారికి నివాళులర్పించేందుకు పలువురు ప్రముఖులు పాకాల మండలం, అదేనపల్లి పంచాయతీ పరిధిలోని పులివర్తివారిపల్లె గ్రామానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఫార్మర్ యూనియన్ మినిస్టర్, టీటీడీ బోర్డు మెంబర్ పనబాక లక్ష్మి,ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ గోపాల్ రెడ్డి, శాప్ చైర్మన్ రవి నాయుడు వీరితో పాటు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన నాయకులు, ప్రజా ప్రతినిధులు లక్ష్మీ భారతి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం, పులివర్తి నాని గారిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
