సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి,చౌటుప్పల్,జులై23,(గరుడ న్యూస్):
ప్రభుత్వం ప్రకటించిన నేతన్న భరోసా లక్ష రుణమాఫి,జియోట్యాగ్ కలిగిన ప్రతి చేనేత కార్మికునికి ఏలాంటి షరతులు లేకుండా అందించాలని,తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం రోజున నేతన్న భరోసా,చేనేత రుణమాఫి పథకాల అమలుకై చౌటుప్పల్ లో నిర్వహించిన అవగాహన సదస్సుకు హాజరైన ప్రిన్సిపాల్ సెక్రెటరీ,చేనేత కమిషనర్ శ్రీమతి శైలజ రామయ్యర్,కి చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో సమస్యలతో కూడిన వినతి పత్రం ఇవ్వడం జరిగింది.అనంతరం ఆయన మాట్లాడుతూ…. చేనేత సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలని కోరారు.నేసిన బట్టలను టెస్కో ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చెయ్యాలని డిమాండ్ చేశారు. చేనేత పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి కార్మికులకు పనికల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని,ప్రభుత్వం ప్రకటించిన నేతన్న భరోసా,చేనేత రుణమాఫి,ఏలాంటి షరతులు లేకుండా వెంటనే అమలు చేసి,జియోట్యాగ్ కలిగిన ప్రతి చేనేత కార్మికునికి అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు గుర్రం నర్సింహా,జిల్లా ప్రధాన కార్యదర్శి గుండు వెంకటనర్సు రాష్ట్ర కమిటీ సభ్యులు ముషం నరహరి,వర్కల చంద్రశేఖర్,గణేష్,కర్ణాటి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు



