

సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి సంస్థాన్ నారాయణపురం,జులై 23,(గరుడ న్యూస్)
రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలను గుర్తించి అర్హులైన వారికి రేషన్ కార్డులు,కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ కార్యక్రమం మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో ఎంపీడీవో ప్రమోద్ కుమార్,ఎంఆర్ఓ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు లబ్ధిదారులు పాల్గొన్నారు. అనంతరం వాళ్లు మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి స్థానిక శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజల పక్షాన నిలబడిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మందుగుల బాలకృష్ణ,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీను నాయక్,మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏపూరి సతీష్,మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షులు దోనూరు జైపాల్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రెడ్యా నాయక్,మాజీ సర్పంచ్ మానిపాటి సతీష్,నారాయణపురం గ్రామ శాఖ అధ్యక్షులు జక్కిడి చంద్రారెడ్డి,ఆర్ ఐ జుబేదార్,సుక్క స్వామి,ప్రభుత్వ అధికారులు లబ్ధిదారులు పాల్గొన్నారు.

