గరుడ ప్రతినిధి
చౌడేపల్లి జూలై 24
యానాదుల ఇళ్ల నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ నాయకుడు లక్ష్మణ రాజు (పతి రాజు) అన్నారు మండలంలోని సెట్టి పేట పంచాయతీ ఎర్ర గంగానపల్లి సమీపంలోని యానాదులకు ఇళ్లను నిర్మించే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఇక్కడి యానాదులకు ఇల్లు నిర్మిస్తామని వైసిపి నాయకుడు కాంట్రాక్టర్ అవతారమెత్తి నాసిరకంగా నిర్మాణం చేపట్టాడన్నారు గోడలకే పరిమితం చేస్తూ అర్ధాంతరంగా నిలిపేశారని ఆయన అన్నారు తాను యానాదులకు ఇల్లు నిర్మించి పూర్తి చేస్తానన్నారు ఈ సందర్భంగా వారి జిల్లా నిర్మాణాలకు భూమి పూజ చేశారు దీంతో యానాదుల్లో ఆనందం వెళ్లి విరిసింది దశాబ్దాల తరబడి పూరి గుడిసెలో నివాసముంటున్న తమకు లక్ష్మణ రాజు (పతి రాజు) ఇళ్లను నిర్మించి ఇస్తున్నారని వారు సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ హరి రాయల్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్తీక్ రాయల్ నాగరాజు రెడ్డి మంజునాథ్ స్థానిక యానాద కుటుంబాలు పాల్గొన్నాయి




