ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (APSSDC) మరియు Oracle University కలసి నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ మరియు ఫౌండేషన్ సర్టిఫికేషన్ కార్యక్రమం.

Panigrahi Santhosh kumar
4 Min Read

Oracle University ఆంధ్రప్రదేశ్ లోని చదువుకునే యువతలో ఆధునిక కోర్స్ ల పరిజ్ఞానం ను అభివృద్ధి చేయడానికి ఉచిత శిక్షణ మరియు ఫౌండేషన్ సర్టిఫికేషన్లను అందిస్తోంది.

ఈ కార్యక్రమం ద్వారా చదువుకునే మరియు చదువు పూర్తి చేసిన కొత్త తరానికి చెందిన యువతకు అవసరమైన AI, జనరేటివ్ AI, క్లౌడ్, డేటా సైన్స్ లాంటి ఆధునిక సాంకేతికతలపై ప్రాథమిక విద్యను అందిస్తుంది.

హైదరాబాద్, బెంగళూరు వంటి సుదూర ప్రాంతాలకు వెళ్ళకుండానే ఇంటివద్దనుండే ఒరాకిల్ యూనివర్సిటీ ద్వారా ఆధునిక కోర్సులలో ఉచితంగా శిక్షణ పొందే అవకాశం.

బహుళ జాతి ఐటీ కంపెనీ Oracle university ద్వారా అందించే ఉచిత శిక్షణా కోర్సులను నేర్చుకుని మీ ఉద్యోగ ఉపాధి అవకాశాలను పెంపొందించుకోండి.

- Advertisement -
Ad image

దీనికి సంబంధించి ORCLE University అందించే ఉచిత కోర్సులు వివరాలు.

  1. క్లౌడ్ కంప్యూటింగ్ ప్రాథమికాలు & Oracle Cloud (OCI)
  2. AI, ML, డీప్ లెర్నింగ్ & జనరేటివ్ AI
  3. క్లౌడ్-నేటివ్ యాప్ డెవలప్‌మెంట్ & సెక్యూరిటీ
  4. డేటా సైన్స్ మరియు లో-కోడ్ యాప్ డెవలప్‌మెంట్ (Oracle APEX ద్వారా)
  5. ERP, HCM, SCM & CXలో ఫంక్షనల్ AI

ఎందుకు చేరాలి? (Why Join?):

కోర్స్ ల యొక్క ఉచిత యాక్సెస్ మరియు ఉచిత ఫౌండేషన్ సర్టిఫికేషన్లు

ఆధునిక Oracle సాంకేతికతలను నేర్చుకోండి

మీ రెజ్యుమో లో అదనంగా డిజిటల్ & క్లౌడ్ నైపుణ్యాల గురించి చేర్చుకోవడం తో పాటు మీ కెరీర్ ప్రొఫైల్‌ను మెరుగుపరుచుకోవడానికి

- Advertisement -
Ad image

ఎవరు అర్హులు
డిగ్రీ మొదటి లేదా రెండవ లేదా మూడవ సంవత్సరం చదువుతున్న కాలేజ్ విద్యార్ధులు.

డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉన్న నిరుద్యోగ యువత.

వయసు తో నిమిత్తం లేకుండా ఏదేని డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం చేస్తూ వృత్తి పరమైన ఎదుగుదలకు సహకరించే ఇతర నైపుణ్యాలను నేర్చుకోవడం లో ఆసక్తి చూపే వారు.

కోర్సులపై ఆసక్తి ఉన్న వారు వెంటనే రిజిస్టర్ అవ్వండి.REGISTER NOW 👇

కోర్స్ లను నేర్చుకోవడానికి Oracle University లో ఖాతా నమోదు ప్రక్రియ (Registration Process):


దశ 1: వెబ్‌సైట్‌కి వెళ్లండి

👉 వెబ్ సైట్ లోకి వెళ్లడానికి ఈ కింది లింక్‌ ను క్లిక్ చేయండి.

https://education.oracle.com/apssdc

దశ 2: “Create an Account” క్లిక్ చేయండి

👉 హోమ్ పేజీలో “Create an Account” అనే బటన్ పై క్లిక్ చేయండి.


దశ 3: ఖాతా సృష్టించడానికి క్లిక్ చేయండి

👉 “Create an Account” అనే ఎంపికపై మరోసారి క్లిక్ చేయాలి. స్క్రీన్‌షాట్ లో చూపిన విధంగా ఉంటుంది.


దశ 4: అవసరమైన వివరాలను పూరించండి

👉 రిజిస్ట్రేషన్ ప్రక్రియ సజావుగా జరిగేలా అవసరమైన అన్ని వివరాలను పూర్తిగా మరియు సరైన రీతిలో నింపండి.


దశ 5: ముఖ్యమైన వివరాలు

Job Title (ఉద్యోగం పదవి): Student అని నింపాలి

Company Name (కంపెనీ పేరు): APSSDC


దశ 6: మీ మెయిల్ ఖాతాలోకి వెళ్లి, వెరిఫికేషన్ మెయిల్ ఓపెన్ చేయండి

👉 మీ ఇన్బాక్స్ లేదా “Updates” ట్యాబ్ లో Oracle నుంచి వచ్చిన మెయిల్‌ లోని Verify Email అనే లింక్ పై క్లిక్ చేయండి.


దశ 7: ఖాతా విజయవంతంగా సృష్టించబడుతుంది

👉 ఇప్పుడు మీ ఖాతా సిద్ధంగా ఉంటుంది. Continue క్లిక్ చేయండి.

📌 గమనిక: ఒక వేళ అది “Activate” అనే పేజీకి తీసుకెళితే, మీ ఖాతాను Active చేయండి.


దశ 8: “Activate Learning” క్లిక్ చేయండి


దశ 9: “Sign In” చేసి లాగిన్ వివరాలు (ఇమెయిల్ & పాస్‌వర్డ్) ఇవ్వండి


దశ 10: ఒరాకిల్ శిక్షణ & సర్టిఫికేషన్ నిబంధనలతో అంగీకరించండి

👉 “I Agree to Oracle Training & Certification, Terms & Conditions” అనే బాక్స్‌ను టిక్ చేయండి.


దశ 11: “Activate” పై క్లిక్ చేసి ఖాతాను యాక్టివేట్ చేయండి


దశ 12: ఖాతాను వ్యక్తిగతీకరించండి (Personalize)

👉 “Start” అనే బటన్ పై క్లిక్ చేయండి.


దశ 13: మీ అభిరుచులు ఎంచుకోండి

👉 ఉత్పత్తులు (Products), రంగాలు (Areas), మరియు పాత్రలు (Roles) లో మీకు ఆసక్తి ఉన్నవి ఎన్నుకోండి. మీరు ఒక్కటికి మించి ఎన్నుకోవచ్చు.

👉 అన్ని learning goals (పాఠన లక్ష్యాలు) ఎంచుకోండి.


దశ 14: మీ ఎంపికలపై ఆధారంగా ఒక నమూనా స్క్రీన్‌షాట్ వస్తుంది

👉 ఎంపికలన్నీ ఇచ్చాక Next క్లిక్ చేయండి.


దశ 15: “Start Learning” క్లిక్ చేసి శిక్షణను మొదలుపెట్టండి


దశ 16: APSSDC కోసం డిజైన్ చేసిన Oracle Learning Portal అందుబాటులో ఉంటుంది


ధన్యవాదాలు! మీ రిజిస్ట్రేషన్ పూర్తయింది. మీరు ఇప్పుడు మీ కోర్స్ లను నేర్చుకోవడం ప్రారంభించవచ్చు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *