


రద్దీ ప్రదేశాలలో డ్రోన్ లు ఉపయోగిస్తూ ఆకతాయిలకు అడ్డుకట్ట వేస్తున్న జిల్లా శక్తి టీమ్స్
పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి, ఐపీఎస్ ఆదేశాల మేరకు పార్వతీపురం పట్టణంలో శక్తి టీమ్స్ పోలీస్ అధికారులు మరియు సిబ్బంది శుక్రవారం పలు పాఠశాలలు మరియు కళాశాలల్లో, బస్ స్టాండ్స్, రద్దీ ప్రాంతాలు సందర్శించి విద్యార్థులకు గుడ్ టచ్ & బ్యాడ్ టచ్, పోక్సో చట్టాలు, సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, డయల్ 112 సేవలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రతీ మహిళ తమ మొబైల్ ఫోనులో తప్పనిసరిగా శక్తి యాప్ ను డౌన్లోడు చేసుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112, శక్తి యాప్ లోని ఎస్.ఓ.ఎస్. బటన్ ను ప్రెస్ చేయాలన్నారు. మొబైల్ ఫోన్లులో శక్తి యాప్ నిక్షిప్తమై ఉంటే మీకు రక్షణగా ఒక కుటుంబ సభ్యుడు మీతో ఉన్నట్లేనన్నారు. ఆపద సమయంలో శక్తి యాప్ లోని ఎస్.ఓ.ఎస్. బటన్ ను ప్రెస్ చేస్తే, వారున్న ప్రాంతం వివరాలను, దగ్గరలో ఉన్న పోలీసు స్టేషనుకు చేరుతుందని, తద్వారా పోలీసులు అప్రమత్తమై, వారున్న ప్రాంతానికి క్షణాల్లో చేరుకొని, మహిళలకు రక్షణగా నిలుస్తారన్నారు. కావున, ప్రతీ ఒక్కరూ తమ మొబైల్ ఫోన్లులో శక్తి యాప్ ను డౌన్లోడు, రిజిస్ట్రేషను చేసుకోవాలన్నారు. విద్యార్థినులకు గుడ్ టచ్ & బ్యాడ్ టచ్ మధ్య తేడా, స్వీయ రక్షణ పద్ధతులు, ఈవ్ టీజింగ్, ప్రేమ పేరుతో మోసాలు మరియు మహిళలపై జరిగే నేరాలపై మరియు చట్టాలపై, సమాజంలో ఆడపిల్లలు, మహిళలు, యువత ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చిస్తూ, బంగారు భవిష్యత్తు కోసం ఏవిధంగా ప్రవర్తించాలనే అంశాల గురించి వివరించారు. సైబర్ నేరాల విషయంలో ఫేక్ ఎస్ఎంఎస్ లు, ఓటిపి మోసాలు, బ్యాంకు పేరుతో వచ్చే ఫోన్ కాల్స్, వాట్సప్ ఫేక్ లింకులు, ఫేక్ లోన్ యాప్స్, కేవైసీ మోసాలు, డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసాలు వంటి వాటి గురించి వివరించారు. ఒకవేళ సైబర్ క్రైమ్ లో బాధితులయితే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1930 ఫిర్యాదు చేసి తగిన వివరాలు తెలపాలి. ఆకతాయిల భరతం పట్టేందుకు, మహిళా రక్షణ కొరకు శక్తి టీమ్స్ రద్దీ ప్రదేశాలలో డ్రోన్ ఎగుర వేసి చుట్టూ పక్కల పరిసర ప్రాంతాలను వీక్షించారు. ఈ అవగాహన కార్యక్రమం లో పార్వతీపురం శక్తి టీం ఇంచార్జ్ ఏఎస్ఐ శ్రీనివాస రావు, సిబ్బంది పాల్గొన్నారు.



