సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిది,సంస్థాన్ నారాయణ పురం,జులై 25,(గరుడ న్యూస్):
భారీ వర్షాల నేపద్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంస్థాన్ నారాయణపురం మండలం ఎస్ఐ జె. జగన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పాత గోడలు గాని,మట్టి గోడలు గాని నాని పోయి కూలిపోయే ప్రమాదం ఉంది అలాంటి ఇళ్ళలో ఉంటున్న ప్రజలు వారు ఖాళీ చేసి సురక్షితమైన ప్రాంతాలలో ఉండగలరు మరియు కరెంటు పోల్స్,ను పిల్లలు పెద్దవాళ్ళు ఎవరు ముట్టుకోవద్దు.వాగులు వంకల మీద ఎవరు కూడా వాహనాలు దాటించదు.అలానే అనవసరంగా బయటికి రావద్దు అని పోలీసు వారి విజ్ఞప్తి చేశారు.ఏదైనా అత్యవసర పరిస్థితి పడినట్లు అయితే పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని ప్రజలకు తెలియజేశారు.



