
గరుడ ప్రతినిధి
చౌడేపల్లి జూలై 26
మండలంలోని పంచాయతీ కేంద్రం పరికిదోనలో సత్య గంగమ్మ ప్రతిష్టను సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు అమ్మవారి ఉపాసకుడు హరినాథ్ ఆధ్వర్యంలో గ్రామ పెద్ద వేలూరు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యుల మధ్య నడివీధిలో సత్య గంగమ్మను ప్రతిష్టించారు ఉదయాన్నే ప్రతిష్టా కార్యక్రమానికి గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి కార్యక్రమాన్ని తిలకించారు అదేవిధంగా విశేష పూజలు నిర్వహించి అమ్మవారి పవిత్ర తీర్థప్రసాదాలు గైకొన్నారు
