



చిత్తూరు జిల్లా, కుప్పం నియోజకవర్గం కొత్తపేట మండలం (గరుడ న్యూస్) ప్రతినిధి ఆర్ మంజునాథ్:చిత్తూరు
జిల్లా గుడుపల్లి మండలం అనగర్లపల్లి గ్రామం చిగుర్లపల్లి రోడ్డులో సర్ధమ్మ కుమారుడు మంజు ఇంట్లో తాళాలు వేసి వెళ్తే,ఆదివారం ఇంటికి తిరిగి వచ్చి చూస్తే ఇంట్లో దొంగలు పడ్డారన్నారు. ఎవరు లేని సమయంలో సర్ధమ్మ కుమారుడు మంజు ఇంటిలో దొంగలు పండంతో భయంబ్రాంతులకు గురయ్యారు.ఇంట్లో సుమారు మూడు సవరణ బంగారం , నగదు 20,0000/ చోరీ జరిగిందని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా ఘటన స్థలానికి చేరుకుని కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
