లయన్స్ క్లబ్ ఆఫ్ కుప్పం వారియర్స్ ఆధ్వర్యంలో బ్రెయిన్స్ హాస్పిటల్ మరియు అల్టియస్ హాస్పిటల్ బెంగళూరు వారిచే ఉచిత గుండె, న్యూరో మరియు ఈ. ఎన్. టి. శిబిరం
చిత్తూరు జిల్లా, కుప్పం నియోజకవర్గం కొత్తపేట మండలం గరుడ న్యూస్ ప్రతినిధి ఆర్ మంజునాథ్: ఆదివారం కుప్పం పట్టణంలో బి. ఆర్. డి హాస్పిటల్ నందు లయన్స్ క్లబ్ ఆఫ్ కుప్పం వారియర్స్ ఆధ్వర్యంలో బ్రెయిన్స్ హాస్పిటల్ మరియు అల్టియస్ హాస్పిటల్ బెంగళూరు వారిచే ఉచిత గుండె, న్యూరో మరియు ఈ. ఎన్. టి. శిబిరం దిగ్విజయంగా జరిగింది. ఈ శిభిరానికి 200 మందికి పైగా హాజరు అయ్యారు. వారిలో 25 మందికి ఉచిత గుండె & న్యూరో శస్త్రచికిత్సకు సిఫార్సు చేయడం జరిగింది అదేవిదంగా ఉచితంగా ఈ సి జి & 2డి ఎకో పరీక్షలు చేసి అవసరమైన వాళ్లకి ఉచితంగా మందులు పంపిణీచేశారు. అలాగే బ్రెయిన్స్ హాస్పిటల్ మరియు అల్టియస్ హాస్పిటల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డా. హరికిరణ్, డా. నితిన్, లయన్స్ క్లబ్ సభ్యులు సెల్వం, సెంథిల్ కుమార్, శివ ప్రసాద్, చరణ్, ప్రసాద్, డా. కృష్ణమూర్తి డా. వరదరాజులు , PRO లు రాజకుమార్, పురుషోత్తం,మణి, మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.