


గరుడ న్యూస్. ప్రతినిధి .రాజేష్
* చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని .తల్లిగారైన పులివర్తి లక్ష్మీ భారతి గారికి నివాళులు అర్పించిన చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాద్ రావు.
పాకాల,nచంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని .మాతృమూర్తి, దివంగత శ్రీమతి పులివర్తి లక్ష్మీ భారతి గారికి ఎంపీ దగ్గుమల్ల ప్రసాద్ రావు గారు నివాళులర్పించారు. పాకాల మండలం, అదేనపల్లి పంచాయతీ పులివర్తివారిపల్లి గ్రామానికి చేరుకున్న ఆయన పులివర్తి లక్ష్మీ భారతి గారి చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం, పులివర్తి నాని కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
