
గరుడ ప్రతినిధి
చౌడేపల్లి జూలై 28
మండలంలోని బిల్లేరు క్రాస్ వద్ద ప్రజలకు ప్రయాణికులకు దాహార్తిని తీర్చడానికి మండల టిడిపి అధ్యక్షులు గువ్వల రమేష్ రెడ్డి సహకారంతో త్రాగునీటి కుళాయిలను ఏర్పాటు చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలకు ప్రయాణికులకు త్రాగునీటి సౌకర్యం కల్పించలేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో స్థానిక నాయకులు త్రాగునీటి ట్యాంకు కొళాయిలు ఏర్పాటు చేశారు. అలాగే ప్రయాణికుల సౌకర్యార్థం బస్ షెల్టర్ మరమ్మతులు చేసి సౌకర్యాలు కల్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మని రాజు, సింగిల్ విండో సభ్యులు సుబ్బరాజు, కొండయ్య గారి పల్లి పార్టీ అధ్యక్షులు ఖాదర్ భాష, చింతమాకులపల్లి పార్టీ అధ్యక్షులు ఎస్ షావలి, షాజహాన్ భాష తదితరులు పాల్గొన్నారు.
