
గరుడ న్యూస్ పుంగనూరు.హత్యాయత్నం కేసులో నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ మదనపల్లె 7త్ ఏడిజె కోర్టు జడ్జి శ్రీలత సోమవారం తీర్పు చెప్పారు. ఇందుకు సంభందించి పుంగనూరు సీఐ సుబ్బారాయుడు, మదనపల్లె ఏపీపి జయ నారాయణరెడ్డి లు తెలిపిన వివరాల మేరకు. చిత్తూరు జిల్లా, పుంగనూరు పట్టణం, నక్కబండకు చెందిన తోటి రాజేష్(26) అదే ఊరికి చెందిన ఫరూక్ గ్రామానికి చెందిన ఓకే అమ్మాయిని ప్రేమించారు. దీంతో ఇరువురు అమ్మాయి కోసం 2022లో కొట్టుకున్నారు. రాజేష్ తన వద్ద ఉన్న కత్తితో ఫరూక్ ను పొడిచి హత్యా యత్నానికి పాల్పడడంతో అప్పటి ఎస్ఐ నిందితుడు రాజేష్ ను అరెస్ట్ చేశాడు. ఈ కేసును మదనపల్లె 7త్ ఏడిజే కోర్టు పూర్వాపరాలని విచారించి, నిందితుడిపై నేరం రుజువు కావడంతో జడ్జి పదేళ్ల జైలు శిక్ష, రూ.30,000జరిమాన విధిస్తూ తీర్పు చెప్పారని తెలిపారు.
