
గరుడ ప్రతినిధి
చౌడేపల్లి జూలై 29
స్వయంభు శ్రీ వైష్ణవి దేవి ఆలయం నాగ పంచమి సందర్భంగా వైష్ణవి దేవి అభయాంజనేయ స్వామి నాగభైరవ స్వాములకు ఉదయమే పంచామృత అభిషేకాలు అనంతరం విశేషంగా కుజదోష పరిహారాలు జరిగాయి ఆలయ అర్చకురాలు శ్రావణి అమ్మవారిని రంగురంగు పూలతో అలంకరించారు చౌడేపల్లి పుంగనూరు పలమనేరు చుట్టుపక్కల గ్రామ ప్రజలు అమ్మవారిని దర్శనం చేసుకున్నారు ఆలయ ధర్మకర్త వినోద్ కుమార్ భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు ఈరోజు ఉభయదారులుగా పలమనేరు మండలం ఏడూరు గ్రామానికి చెందిన వెంకట రమణారెడ్డి సుభద్రలు వ్యవహరించారు



