
కొమరాడ మండలం లో గల డా. బి. ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో (బాలికలు) ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్న మిగులు సీట్ల భర్తీ కి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నట్లు ఉమ్మడి జిల్లాల సమన్వయకర్త ఎస్. రూపవతి తెలిపారు. కొమరాడ గురుకుల పాఠశాలలో ఐదవ తరగతికి సంబంధించి 37 సీట్లు, ఆరవ తరగతికి 02 సీట్లు, ఏడవ తరగతిలో 13 సీట్లు, 8వ తరగతిలో 10 సీట్లు, 9వ తరగతిలో 4 సీట్లు, 10వ తరగతికి 13 సీట్లు, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం లో 5 సీట్లు ఖాళీలుగా ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు అర్హులైన ఎస్సి ఎస్టి విద్యార్థులు మాత్రమే ఈ మిగులు సీట్లలో స్పాట్ అడ్మిషన్ల కోసం కొమరాడ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలకు ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని ప్రిన్సిపాల్ ఎల్. పద్మావతి తెలిపారు.