గరుడ న్యూస్,మక్కువ
మక్కువ మండల పరిధిలో మక్కువ గ్రామం, దబ్బ గడ్డ గ్రామాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమం ప్రతి మంగళ,బుధ వారాలలో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా వరి నాట్లు వేసేటప్పుడు నారు చివర్లు త్రుంచి నాట్లు వేయాలని రైతులకు అవగాహన కల్పించారు.ఎలా చేయడం వల్ల కాండం తొలిచే పురుగు నివారించవచ్చు అని వివరించారు. అలాగే కాలిబాటలు తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది.
.నానో యూరియా, నానో డిఏపీలు ఇది ద్రవరూపంలో ఉంటాయి పంటలకు త్వరగా అవసరమైన పోషకాలను అందించే ఆధునిక ఎరువులు. ఇవి పంటల పెరుగుదలను, దిగుబడిని పెంచడంలో సహాయపడతాయి సాధారణ ఎరువుల వాడకాన్ని తగ్గించడానికి దోహదం చేస్తాయి. ఈ కార్యక్రమానికి మండల వ్యవసాయ అధికారి చింతల భారతి, ఆ గ్రామాల యొక్క గ్రామ వ్యవసాయ సహాయకులు ఏం. హేమంత్ రైతులు పాల్గొన్నారు.
