


తిరుపతి జిల్లా రేణిగుంట.
స్టాప్ రిపోర్టర్ పాకాల మురళి (గరుడ న్యూస్): శ్రీకాళహస్తి రోడ్డు సమీపంలోని పాంచాలినగర్ లో, రోడ్డుని అడ్డగించి ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు. 14 అడుగుల రోడ్డును తగ్గించి అందులోనే ,కొంత భాగంలో ఇంటి నిర్మాణం ప్రారంభించారు. స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు. కనీసం అంబులెన్స్, ఫైర్ ఇంజన్వాహనం, వెళ్లేందుకు దారిలేకుండా, చేశారని ప్రజలుఆవేదన వ్యక్తంచేశారు . దీంతోసానుకూల సమాచారాన్ని బట్టి వార్తను ప్రచురించాం. మా వార్తకు ,స్పందించిన ఎమ్మార్వో తక్షణమే, తనసిబ్బందితో, ఆ ప్రాంతానికివెళ్లి, ఆనిర్మాణాన్ని ఆపివేశారు. స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలించగా, కరకంబాడి లెక్కదాకాలో ఉన్నసర్వే నెంబర్ను, తూకివాకం గ్రామం లెక్క దాకాల్లో చేర్చి, రిజిస్ట్రేషన్ చేశారు. ఎమ్మార్వో పత్రాలను పరిశీలించగా, తేడాను గుర్తించి ఈ స్థలం ప్రభుత్వ భూమిగా,నిర్ధారించారు, నిర్మాణాన్ని ఆపివేశారు.
స్థానిక ప్రజలు, రేణిగుంట ఎమ్మార్వో చంద్ర శేఖర్ రెడ్డిని,అభినందించారు.
